Krishna Sagar Rao: ముస్లింలనే ఎంపిక చేసుకోవడం ఎందుకు?

Krishna Sagar Rao: ముస్లింలకు రూ. లక్ష ఆర్థిక సాయం ఖండించిన బీజేపీ

Update: 2023-07-25 01:42 GMT

Krishna Sagar Rao: ముస్లింలనే ఎంపిక చేసుకోవడం ఎందుకు?

Krishna Sagar Rao: ఓటును కొనుగోలు చేసేందుకు వివిధ బ్లాక్‌ల ఓటర్లకు పన్ను చెల్లింపుదారుల డబ్బును పంపిణీ చేయడం ద్వారా సీఎం కేసీఆర్.. ఎన్నికల అవినీతికి పాల్పడటాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్‌రావు. కేసీఆర్ ప్రజల సొమ్ముతో కొనుగోళ్లు సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రతి ముస్లిం కుటుంబంలో ఒకరికి లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ముస్లింలనే ఎంపిక చేసుకోవడం ఎందుకు..? ఎన్నికల ముందు ఇలాంటి అవినీతి నిర్ణయాలు తీసుకునే అర్హత ఆయన ప్రభుత్వానికి ఎలా ఉందని ప్రశ్నించారు.

ఇది అవినీతి కాకపోతే? ఏమిటి?తను ఎన్నికైన ప్రభుత్వం కేవలం రాష్ట్ర ఖజానాకు సంరక్షకుడని, తన రాజకీయ ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా నిధులు వెచ్చించే రాజు కాదని సీఎం కేసీఆర్ అర్థం చేసుకోవాలన్నారు. ఈ అనైతిక మరియు అన్యాయమైన అవినీతి ఎన్నికల జిమ్మిక్కులపై బీజేపీ అధికారికంగా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమీషన్‌లకు ఫిర్యాదు చేయనుందని తెలిపారు.

Tags:    

Similar News