Nagoba Jathara: రెండో అతిపెద్ద గిరిజన జాతరకు ముహూర్తం ఖరారు..ఈ నెల 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం

Update: 2025-01-03 04:30 GMT

Nagoba Jathara: దేశంలోనే రెండో అతిపెద్ద ఆదివాసి గిరిజన సంబురం నాగోబా జాతర. ఈ జాతర ఈనెల 28న ప్రారంభం కాబోతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ లో ఏటా పుష్యమమాస రోజున నాగోబా జాతర అర్ధరాత్రి మహా పూజతో ప్రారంభమవుతుంది. అప్పటినుంచి ఐదు రోజులపాటు ఈ జాతర ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది 28వ తేదీన అమావాస్య కావడంతో ఆ రోజున అర్ధరాత్రి పూజలు చేసి జాతరను ప్రారంభిస్తారు ఆదివాసులు. ఈ జాతరలో కీలకమైన మూడోరోజు నిర్వహించే గిరిజన దర్బార్ ఈనెల 31వ తేదీన జరగనుంది. జాతర ఏర్పాట్లకు సంబంధించి గురువారం కేసులాపూర్ లో అధికారులు సమావేశం అయ్యారు.

జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఉట్నూరు ఐటీటీఏ పీవో ఖుష్బూగుప్తా, ఎస్పీ గౌష్‌ ఆలం, సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్ సహా అధికారులు ముందుగా నాగోబాను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి, నేతలను ఈ జాతరకు ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జాతర పూర్తయ్యేంతవరకు కేస్లాపూర్ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధించనున్నారు. గురువారం నెలవంక దర్శనమిస్తుండడంతో తొలి ఘట్టం ఏడు రోజుల పాటు సాగే ప్రచార రథం శుక్రవారం కేసులాపూర్ లో బయలుదేరుతుంది. మోసం వంశయుల ప్రత్యేక పూజలు అనంతరం రథం ముందుకు కదులుతుంది.

స్వాతంత్రం రాకముందు నిజాం పాలనలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు నివసిస్తున్న తండాలు, గుడెలకు, గ్రామాలకు కనీస సౌకర్యాలు ఉండేవి కావు. వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న రోజులవి. మరోవైపు స్వాతంత్ర పోరాటం ఉదృతంగా సాగుతోంది. నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసి బిడ్డ తెలంగాణ యోధుడు కొమరం భీమ్ పోరాటం చేసి అమరుడయ్యారు. ఈ పోరాటం నిజాం గుండెల్లో వణుకు పుట్టించేలా చేసింది. దీంతో ఆదివాసుల సమస్యలపై దృష్టి సారించి వారి జీవన విధానంపై అధ్యాయం కోసం హైమన్ డార్ఫ్ దంపతులను ఈ ప్రాంతానికి పంపించారు నిజాం.

ఆదివాసుల జీవన విధానంపై అధ్యాయం చేస్తున్న ఆస్ట్రియాకు చెందిన దంపతులను నాగోబా జాతర చాలా ఆకర్షించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులు ఈ జాతరకు వచ్చి మహా సమ్మేళనంగా పాల్గొనడం వారి సంస్కృతి, సాంప్రదాయాలు ఆ దంపతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదివాసుల సమస్యలపై డార్ఫ్ దంపతులు ఫోకస్ పెట్టారు. నాగోబా జాతర సందర్భంగా గూమికూడిన ఆదివాసుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదే దర్బార్.. ఆ దర్భార్ లో ఆదివాసుల సమస్యలను తెలుసుకొని నిజాం ప్రభూకు అందించారు. అలా మొదటగా 1942లో ధర్బార్ నిర్వహించారు. ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది.

Tags:    

Similar News