New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్..వెంటనే దరఖాస్తు చేసుకోండి

Update: 2025-01-03 03:20 GMT

New Ration Cards: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించిన హామీల్లో చాలా వరకు నెరవేరలేవు. ముఖ్యంగా రేషన్ కార్డులపై ప్రజలు చాలా నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ వాటి విషయంలో భారీగా జాప్యం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి ఏడాది దాటినా ఇంకా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం లేదని ప్రజలు అంటున్నారు. అయితే సంక్రాంతికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం గతంలో కూడా ఇలానే దసరాకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డు పై భారీ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

సిద్దిపేట జిల్లా కోహెడలో కార్యకర్తలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్.. రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుగా మంజూరుకు సంబంధించి కసరత్తు జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు తమ మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరు పై పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో కొత్తగా ఏర్పడిన కుటుంబాలు, కొత్త పెళ్లిళ్లు చేసుకునేవారు, కొత్త కార్డుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని మంత్రి తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు పై మంత్రి తాజా ప్రకటనతో ప్రజలలో ఉత్సాహం కలిగిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం రైతు సంక్షేమానికి రూ.30 వేల కోట్లు కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.తన నియోజకవర్గం హుస్నాబాద్ లో 250 పడకల హాస్పిటల్ కు మంజూరు లభించిందని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని మంత్రి వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ ఉత్సాహాన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు.

Tags:    

Similar News