Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో మిగిలిన 6 బెర్త్‌లు దక్కేది ఎవరికి?
Telangana Cabinet: రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి ఆశలు
Telangana Cabinet: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో 12మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే మిగిలిన ఆరు బెర్త్‌లు దక్కేది ఎవరికి అనే చర్చ సాగుతోంది. 11మంది మంత్రులతో పాటు ముఖ్యమంత్రి వద్ద కీలక శాఖలు, ఒక్కొక్కరి వద్ద రెండు నుండి మూడు శాఖలు ఉన్నాయి. 14 తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత పూర్తిస్థాయి మంత్రి వర్గం ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
కేబినెట్‌లో ఆరు బెర్త్‌ల కోసం చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాల ప్రకారం కొత్తవారికి సూతం మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు టికెట్ త్యాగాలు చేసిన సీనియర్ నేతలు, ఓడిపోయిన నేతలు కూడా మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అయితే ఓ కీలక నేతకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ నుండి సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మదన్ మోహన్ రావు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్, వినోద్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి కేబినెట్‌లో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు.