Phone Tapping Case: రాధాకిషన్ పోలీస్ కస్టడీపై వెస్ట్‌జోన్ డీసీపీ ప్రకటన
Phone Tapping Case: రాధాకిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది
Phone Tapping Case: టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ పోలీస్ కస్టడీపై వెస్ట్‌జోన్ డీసీపీ ప్రకటన విడుదల చేశారు. రాధాకిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని, SIBలో హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం కేసులో.. రాధాకిషన్ కుట్రదారుడిగా ఉన్నారని తెలిపారు. అనధికారికంగా పలువురు ప్రముఖుల ప్రొఫైల్స్ తయారుచేసి.. అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని, బెదిరింపులకు పాల్పడి ఓ పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశారని వెస్ట్‌జోన్ డీసీపీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో.. హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయించారన్నారు. ప్రణీత్‌రావుకు రాధాకిషన్ సహకరించారని, ప్రొఫైల్స్‌కు సంబంధించిన వ్యవహారాలు బయటకు రాకుండా ఉండేందుకు ఆధారాలు ధ్వంసం చేశారన్నారు. కోర్టు అనుమతితో రాధాకిషన్‌ను కస్టడీలోకి తీసుకున్నామని, ఈనెల 10 వరకు రాధాకిషన్‌ను విచారిస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ చెప్పారు.