Rythu Bandhu: రైతుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ- సీఎం కేసీఆర్
Rythu Bandhu: తెలంగాణలో భూ తగదాలు ఉండకూడదనే ధరణి తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు.
Rythu Bandhu: తెలంగాణలో భూ తగదాలు ఉండకూడదనే ధరణి తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణి కోసం మూడేళ్లు కష్టపడ్డామన్నారు. రెవెన్యూలో 37 రకాల చట్టాలున్నాయని అవి ఎవరికి అర్ధం కావన్నారు. ఆ చట్టాలతో ఇష్టానుసారం రైతులను ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. ఒక్కసారి ధరణిలో భూమి ఎక్కిందంటే దాన్ని ఎవరూ మర్చలేరని సీఎం స్పష్టం చేశారు. మూడు రకాలుగా మాత్రమే భూమి ఇతరులకు మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణలో పత్తి బాగా ఉత్పత్తి అవుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో పత్తిని పండించేందుకు రైతులు ఆసక్తి చూపాలన్నారు. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుందని సీఎం అన్నారు. అందుకే రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు అందిస్తున్నామన్నారు. 95 శాతం రైతుబంధు సద్వినియోగం అవుతోందన్నారు. అవినీతిని అరికట్టేందుకు రైతులకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమా చేస్తున్నామన్నారు. రైతులకు మంచి జరుగుతుంటే కొందరికి నచ్చడం లేదని స్పష్టం చేశారు.