Warangal Farmers: తెలంగాణలో వరి పండించేవారికి గండం
Warangal Farmers: *బాయిల్డ్ రైస్ కొనేది లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం *తాము కూడా కొనలేమంటున్న తెలంగాణ ప్రభుత్వం
Warangal Farmers: దేశానికే అన్నం పెట్టే రైతు ఇప్పుడు అప్పుల పాలవుతున్నాడు. దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేయలేమని FCI కొర్రి పెడుతోంది. ఈ ప్రకటనతో రైతన్నలు ఆందోళనలో పడ్డారు. వరంగల్ జిల్లాలో 80శాతానికి పైగా దొడ్డు రకం వడ్లు సాగు చేశారు. 20 శాతం సన్న రకాలు వరి సాగు చేశారు. ఈ వానాకాలం పంటల నుంచి దొడ్డు రకం ధాన్యం కొనలేమని తెగేసి చెప్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కేవలం సన్న రకం ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది.
ఎకరానికి 35వేల రూపాయలు పెట్టుబడులు పెట్టామని ఉన్నట్టుండి ఇప్పుడు దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేయమంటే తమ పరిస్థితేంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న ధ్యాస, తమపై లేదని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని వరంగల్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కేవలం రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదంటున్నారు. ఇప్పటికైనా స్వయంగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.