Telangana Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Telangana Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
Telangana Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020, ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020ని ఆమోదించింది.
- పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ - గ్రామ పంచాయత్స్ - ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు - 2018 సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- వీఆర్వో వ్యవస్థ రద్దు, టీఎస్ బీపాస్, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019 సవరణ, తెలంగాణ జీఎస్టీ చట్టం-2017, తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లుతో పాటు తెలంగాణ సివిల్ కోర్టు చట్టం-1972 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం సవరణ ఆర్డినెన్స్-2020, తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్-2020, తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్లు-2020లకు కేబినెట్ పచ్చజెండా ఊపింది..
- ఆయుష్ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదించింది.
- కొత్త సచివాలయ నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదించింది.
- కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది.
- 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలంటూ బీసీ కమిషన్ చేసిన సిఫార్సులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
- కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్సులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపైనా మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించారు.