Votes Counting: రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్.. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
Votes Counting: రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్‌కు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు
Votes Counting: రేపు తెలంగాణ ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్‌కు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. 119 నియోజకవర్గాలకు గాను 119 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పరిధిలో 15చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికంగా టేబుళ్లను అందుబాటులో ఉంచనున్నారు.
కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, పటాన్‌చెరు తదితర నియోజకవర్గాల్లో 400లకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 20+1 టేబుళ్లను.. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ తదితర నియోజకవర్గాల్లో 500లకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 28+1 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇక.. పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేక టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. 119 నియోజకవర్గాల్లో సుమారు రెండున్నర లక్షల పోస్టల్ బ్యాలెట్ల జారీ చేసినట్టు ఈసీ స్పష్టం చేసింది. ఇక.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.