Arvind Dharmapuri: బీజేపీకి ఓటు వేయండి 4వేలు పెన్షన్ వస్తాయి
Arvind Dharmapuri: బీజేపీకి ఓటు వేస్తే పెన్షన్లు ఆగిపోతాయన్న వారి మాటలు నమ్మకండి
Arvind Dharmapuri: ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీజేపీకి ఓటు వేస్తే పెన్షన్లు ఆగిపోతాయన్న వారి మాటలు నమ్మకండి అని కోరుట్ల బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం మండలంలో కార్నర్ మీటింగులలో ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. మీకు 2 వేల రూపాయల పెన్షన్ తప్ప ఏమీ వద్దా అని ప్రజలను ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేయండి 4 వేలు వస్తాయని తెలిపారు. నరేంద్రమోడీ ఫ్రీగా 5 కిలోల బియ్యం ఇస్తున్నాడని... ఇంకా ఐదు ఏళ్ల వరకు ఇస్తాడని మోడీ చెప్పాడని అర్వింద్ అన్నారు.