Viral Fevers: తెలంగాణలో భయపెడుతున్న విషజ్వరాలు

Viral Fevers: విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్‌

Update: 2021-10-13 04:51 GMT

 తెలంగాణలో భయపెడుతున్న విషజ్వరాలు (ఫైల్ ఇమేజ్)

Viral Fevers: రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మంచానపడుతున్నారు. రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు వైరల్ ఫివర్స్‌తో ప్లేట్‌లెట్స్‌ కౌంట్ తగ్గిపోతుండడంతో పేషంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా లక్ష నుండి 4 లక్షలపై వరకు ప్లేట్‌లెట్స్‌ కౌంట్ ఉండాలి. WBC 4వేల నుంచి 13వేల వరకు ఉండొచ్చు. కానీ ప్రస్తుతం వైరల్ జ్వరాలతో పాటు డెంగ్యూకి అమాంతం ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. మరోవైపు జ్వరాలతో బాధపడే రోగులని దోచుకునేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ సిద్ధం అయ్యాయి. ప్లేట్‌లెట్స్‌ కౌంట్ లక్ష ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో దోచుకుంటున్నారని బాధితులు అంటున్నారు

గడిచిన నెల రోజులుగా జ్వరాలతో రోగులు అధికంగా వస్తున్నారని, ప్రస్తుత్తం బెడ్స్ అందుబాటులో ఉన్నాయని నల్లకుంటా ఫీవర్ హాస్పిటల్ RMO జయలక్షి తెలిపారు. రోజుకి 1300 పైగా ఔట్ పేషంట్స్ వస్తున్నారని చెప్పారు. ప్లేట్‌లెట్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత లేదని స్పష‌్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, విషజ్వరాలు పెరిగాయని గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ కేసులు నమోదయ్యాయని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు. కొన్ని జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని ఇప్పటికే ఆ జిల్లాల్లో వెళ్లి పర్యటించి కేసులు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

Full View


Tags:    

Similar News