Lockdown: కరోనా సెకండ్ వేవ్ భయంతో పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్‌డౌన్
Lockdown: ఈనెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సెల్ప్ లాక్‌డౌన్ విధించారు.
Lockdown: కరోనా సెకండ్ వేవ్ భయంతో పలు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోరండ్ల గ్రామంలో సెల్ప్ లాక్‌డౌన్ విధించుకున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రామ సర్పంచ్ సూచనల మేరకు పంచాయతీ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సెల్ప్ లాక్‌డౌన్ విధించారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులందరూ సెల్ఫ్ లాక్‌డౌన్‌కు సహకరించాలన్నారు సర్పంచ్ త్రివేణి. కరోనా ప్రబలకుండా శానిటైజేషన్ చేస్తున్నామని.. ప్రతి వార్డులో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నామన్నారు.