Villagers tied Electrical Staff:విద్యుత్ అధికారులకు వింత పనిష్మెంట్ ఇచ్చిన గ్రామస్థులు..
Villagers tied Electrical Staff: విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అదికారులకు ఎవరైనా బిల్లు నగదు ఇచ్చి పంపిస్తారు.
Villagers tied Electrical Staff: విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అదికారులకు ఎవరైనా బిల్లు నగదు ఇచ్చి పంపిస్తారు. కానీ ఓ గ్రామానికి చెందిన వారు మాత్రం ఆ అధికారులకు విచిత్ర తరహాలో సమాధానం ఇచ్చారు. అధికారులకు డబ్బులు ఇవ్వడానికి బదులు చెట్టుకు కట్టేసారు. ఈ వింత సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లెకెళితే... మెదక్ జిల్లా అల్లదుర్గ మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామానికి కొంత మంది విద్యుత్ అధికారులు బిల్లులు వసూలు చేయడానికి శనివారం వచ్చారు.
అయితే గ్రామంలోని విద్యుత్ సమస్యల గురించి, బిల్లుల సమస్యల గురించి ఆయా అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు. అధిక విద్యుత్ బిల్లులు, విద్యుత్‌లో అంతరాయం వంటి సమస్యలను కూడా వారు చూసి చూడనటూ వెదిలేస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై విసుగు చెందిన గ్రామస్తులు బిల్లుల కోసం వెళ్లిన అధికారులను చెట్టుకు కట్టేసి నిలదీస్తున్నారు. వారిపై అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే వరకు విడిచేది లేదని గ్రామస్థులు స్పష్టం చేశారు. రోజులకు రోజులు విద్యుత్‌లో అంతారాయం కలిగి చీకటిలో గ్రామం మగ్గిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, విద్యుత్ ను వాడకపోయినా అధిక కరెంటు బిల్లులు రావడాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న, అధిక బిల్లులు వసూలు చేయడం వంటి విద్యుత్ సమస్యలను చెప్పటినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.