హైకోర్టు జడ్జిగా విజయ్‌సేన్‌ రెడ్డి.. నేడు ప్రమాణ స్వీకారం

Update: 2020-05-02 04:49 GMT

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా బొల్లంపల్లి విజయ్‌సేన్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న విజయ్‌సేన్‌రెడ్డిని హైకోర్టు జడ్జిగా నియమించాలని గతనెలలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ సిఫారసులను కేంద్ర న్యాయశాఖ రాష్ట్రపతికి పంపగా, ఆయన ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. శనివారం ఉదయం 11.30 గంటలకు విజయ్‌సేన్‌ రెడ్డి జడ్జిగా ప్రమాణం చేస్తారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకంతో హైకోర్టు జడ్జిల సంఖ్య 14కు చేరింది.

Tags:    

Similar News