Vijayashanti: కేసీఆర్ అవినీతిపై బీజేపీ వద్ద ఆధారాలున్నాయి
Vijayashanti: బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే
Vijayashanti: కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదటిసారి గాంధీభవన్ కి వచ్చిన విజయశాంతికి ఏఐసీసీ నేతలు స్వాగతం పలికారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు విజయశాంతి. కేసిఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజెపి చెబితే ఆ పార్టీలోకి వెళ్లాను. ఏళ్లు గడచినా ఆ మేరకు చర్యలు తీసుకోలేదన్నారు ఆధారాలు ఉండి కూడా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటి అని అర్థం అయ్యిందని…తెర ముందు ఒకటి.. తెర వెనుక ఒకటి మట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులను మోసం చేస్తుందని..నమ్మించి మోసం చేస్తున్నారని ఆగ్రహించారు. బండి సంజయ్‌ని.. మార్చిన తర్వాత బిజెపి గ్రాఫ్ పడిపోయిందని స్పష్టం చేశారు.