YSRTP: పాలేరు నుంచి విజయమ్మ, కొత్తగూడెం నుంచి షర్మిల పోటీ?
YSRTP: ఇద్దరి పోటీ ప్రధాన పార్టీల్లో చూపించే ప్రభావమెంత?
YSRTP: ఖమ్మం జిల్లాలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల హీట్ కొనసాగుతుండగా.. తాజాగా YSRTPలో మారుతున్న సమీకరణాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. తాజాగా YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయలక్ష్మి ఖమ్మం జిల్లా నుంచే అసెంబ్లీ బరిలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తామని ప్రకటించారు వైఎస్ షర్మిల. మరో వైపు తల్లీకూతుళ్లు ఒకే జిల్లా నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.
పాలేరు నియోజకవర్గం నుంచి విజయలక్ష్మి, కొత్తగూడెం నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో ఊపందుకుంది. అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తల్లీకూతుళ్ల పోటీతో మారే పరిణామాలేంటి? ఆ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరి పోటీతో ఈక్వేషన్స్ మారుతాయా అనే చర్చ తెలంగాణ పాలిటిక్స్‌లో జరుగుతోంది. ఇక తల్లీకూతుళ్ల పోటీ.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ఏ మాత్రం ప్రభావం చూపుతుందనే ఆసక్తి నెలకొంది.