Venkaiah Naidu: జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి
Venkaiah Naidu: పలు రంగాల్లోని శిక్షకులతో మాట్లాడిన వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంషాబాద్‌లోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జీ మల్లికార్జునరావు, జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్, ఇతర సీనియర్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలకు చెందిన డ్రాపౌట్ యువతకు వొకేషనల్ ట్రైనింగ్‌ను అందించి, వారికి ఉపాధి అవకాశాల కల్పనలో సహాయపడుతోంది. ఎలెక్ట్రీషియన్, హోటల్ మేనెజ్మెంట్, టూవీలర్ టెక్నీషియన్, వెల్డింగ్ టెక్నీషియన్, ఫాల్స్ సీలింగ్, ఏసీ టెక్నీషియన్ శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులతో వెంకయ్యనాయుడు మాట్లాడి శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. ఎలెక్ట్రికల్ కోర్సును అభ్యసిస్తున్న ట్రెయినీలకు ఆయన కిట్లను అందజేశారు. జనపనార బ్యాగులు తయారు చేయడంలో శిక్షణ పొందుతున్న మహిళలతోనూ ఆయన మాట్లాడారు.