Venkaiah Naidu Congratulates Health Officer: వైద్యారోగ్యశాఖ సర్వైవ్‌లెన్స్ అధికారికి ఉపరాష్ర్టపతి అభినందన..
Venkaiah Naidu Congratulates Health Officer: పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ వైద్యారోగ్యశాఖ సర్వైవ్‌లెన్స్ అధికారిని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు అభినందించారు.
Venkaiah Naidu Congratulates Health Officer: పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ వైద్యారోగ్యశాఖ సర్వైవ్‌లెన్స్ అధికారిని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడకు చెందిన 45 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆదివారం పెద్దపల్లి జిల్లా ప్రధాన దవాఖానలో చేరాడు. ఆ తరువాత వైద్యులు ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. అయినా ఫలితం దక్కలేదు అదే రోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బాధితుడు మృతి చెందాడు. దీంతో వైద్య సిబ్బంది వెంటనే ఆ సమాచారాన్ని బాధితుని కుటుంబ సభ్యులకు ఇచ్చినా రావడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో శవాన్ని తరలించేందుకు మున్సిపల్ అధికారులు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ వ్యక్తి కరినాతో చనిపోయాడని ట్రాక్టర్ డ్రైవర్ వాహనం నడిపేందుకు నిరాకరించాడు.
దీంతో పెద్దపల్లి జిల్లా వైద్యారోగ్యశాఖ సర్వైవ్‌లెన్స్ అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ మానవతా థృక్పదంతో ముందుకు వచ్చారు. ఇతర వైద్యుల సహకారంతో మృతదేహాన్ని ట్రాక్టర్‌లో వేసుకుని తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. కరోనా నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఉపరాష్ర్టపతి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అభినందిస్తున్నారు. వీరి చొరవ, అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని పేర్కొన్నారు. డాక్టర్ చూపిన మావనవతపై సర్వత్రా సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.