Vinod Kumar: అడవుల విస్తరణలో దేశంలోనే తెలంగాణ టాప్
Vinod Kumar: కిషన్‌రెడ్డికి తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ కౌంటర్
Vinod Kumar: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ వినోద్‌కుమార్ కౌంటర్ ఇచ్చారు. అడవుల విస్తరణలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. ఇదే విషయం నీతి ఆయోగ్ నివేదికలో కూడా ఉందన్నారు. కరోనా కాలంలోనూ కాంపా నిధులను పెద్ద ఎత్తున వినియోగించుకున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. కిషన్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని.. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ, ఇతర రాష్ట్రాల్లో కాంపా నిధుల వినియోగంపై నివేదికలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.