shobitha shivanna: ఆత్మహత్యతోనే శోభిత మృతి..పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడి
శోభిత శివన్న మృతదేహానికి సోమవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తైంది.డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శోభిత తన ఇంట్లో చనిపోయారు.
శోభిత శివన్న మృతదేహానికి సోమవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తైంది.డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శోభిత తన ఇంట్లో చనిపోయారు. బెడ్ రూమ్ లో ఆమె సూసైడ్ చేసుకున్న విషాన్ని డిసెంబర్ 1 ఉదయం భర్త సుధీర్ రెడ్డి గుర్తించారు. శోభిత డెడ్ బాడీపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తేల్చారు. ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఆమె మరణించిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కన్నడ, తెలుగు సీరియల్స్ లో ఆమె నటించారు. పెళ్లైన తర్వాత ఆమె నటనకు దూరంగా ఉన్నారు.
తమ సంప్రదాయం ప్రకారంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని శోభిత కుటుంబ సభ్యులు శోభిత కుటుంబసభ్యులకు చెప్పారు. కానీ, తమ స్వగ్రామంలోనే శోభిత అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పి డెడ్ బాడీని తీసుకెళ్లారని శోభిత భర్త సుధీర్ రెడ్డి తండ్రి మీడియాకు చెప్పారు. తమ కుటుంబంలో శోభిత కలిసిపోయిందని వారు ఆమె గురించి గుర్తు చేసుకున్నారు.
అంతా బాగుందని కుటుంబ సభ్యులకు ఫోన్
ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు ఆమె తన కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ అంతా బాగానే ఉందని కుటుంబసభ్యులకు శోభిత చెప్పారని సమాచారం. అయితే ఇంతలోనే ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.