Vajedu SI Suicide: తుపాకీతో కాల్చుకుని.. వాజేడు ఎస్‌ఐ హరీశ్ ఆత్మహత్య
Vajedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్‌లో తుపాకీతో కాల్పుకొని హరీష్ సూసైడ్ చేసుకున్నాడు.
Vajedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్‌లో తుపాకీతో కాల్పుకొని హరీష్ సూసైడ్ చేసుకున్నాడు. నిన్న ఉదయం ఒంటరిగా వెళ్లిన ఎస్సై హరీష్.. ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో ఫెరిడో రిసార్ట్ సిబ్బందికి అనుమానం వచ్చి వెళ్లి చూడగా రిసార్ట్‌లోని బెడ్‌పై విగతజీవిగా పడివున్నాడు ఎస్సై హరీష్. వెంటనే విషయాన్ని వాజేడు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. వ్యక్తిగత కారణాలతో హరీశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామం.. హరీష్ మృతి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా వారం రోజుల క్రితం వాజేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు హతమార్చారు. ఆ ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్ లో SIగా పని చేస్తున్న హరీష్ ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది.