రంగారెడ్డి జిల్లా ఆలూరులో లారీ భీభత్సం: ముగ్గురు మృతి

లారీ భీభత్సం సృష్టించింది. కూరగాయల వ్యాపారులపైకి సోమవారం లారీ దూసుకెళ్లింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

Update: 2024-12-02 11:51 GMT

రంగారెడ్డి జిల్లా ఆలూరులో లారీ భీభత్సం: ముగ్గురు మృతి

లారీ భీభత్సం సృష్టించింది. కూరగాయల వ్యాపారులపైకి సోమవారం లారీ దూసుకెళ్లింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వారిపై అదుపుతప్పి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని లారీ నిలిచిపోయింది. లారీ వేగంగా చెట్టును ఢీకొనడంతో చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్ లోనే ఇరుక్కుపోయారు.మృతులను రాములు, ప్రేమ్, సుజాతగా గుర్తించారు.చేవేళ్ల నుంచి మొయినాబాద్ వైపు వెళ్లే రోడ్డు పక్కనే రైతులు కూరగాయాలు విక్రయిస్తుంటారు. అతి వేగంగా వచ్చిన లారీ కూరగాయాలు విక్రయిస్తున్న వారిపై దూసుకెళ్లింది.

రోడ్డు విస్తరించాలని  డిమాండ్

ఇవాళ ప్రమాదం జరిగిన కిలోమీటర్ దూరంలోనే డిసెంబర్ 1న జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు మరణించారు. లారీ, కారు ఢీకొని బీడీఎల్ ఉద్యోగి దంపతులు మరణించారు. రోడ్డు విస్తరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News