Lagacharla Industrial Park: లగచర్లలో మల్టిపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు నోటిఫికేషన్..

Lagacharla Industrial Park: దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 29న రద్దు చేసింది.

Update: 2024-11-30 07:40 GMT

Lagacharla Industrial Park: లగచర్లలో మల్టిపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు నోటిఫికేషన్..

Lagacharla Industrial Park: దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 29న రద్దు చేసింది. అయితే దీని స్థానంలో మల్టిపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన భూమిని సేకరించనుంది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో దుద్యాల మండలం లగచర్లలో 110.32 భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి తొలుత ప్రభుత్వం భూములను సేకరించనుంది. పోలేపల్లిలో 71.89 ఎకరాలను సేకరించనున్నారు. భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 11 ప్రకారం నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

లగచర్లలో అధికారులపై దాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం

దుద్యాల మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ కోసం 2024, ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసింది. ఫార్మా కంపెనీలకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు స్థానిక రైతులు అంగీకరించలేదు. ఈ విషయమై రైతులు కొంతకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలకు ప్రజా సంఘాలు, బీఆర్ఎస్ మద్దతు ప్రకటించాయి. నవంబర్ 11న లగచర్లలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయసేకరణను ఏర్పాటు చేశారు. ఈ విషయమై రైతులు, స్థానికులతో మాట్లాడేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారులపై స్థానికులు దాడికి యత్నించారు. పోలీసులు వారిని రక్షించారు. కడా అధికారి వెంకట్ రెడ్డిపై స్థానికులు దాడికి దిగారు. ఈ ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లగచర్ల గ్రామానికి చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

Tags:    

Similar News