Revanth Reddy Tweet: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. సీఎం ఆసక్తికర ట్వీట్..
Revanth Reddy Tweet: తెలంగాణలో రైతు పండగ ముగింపు కార్యక్రమాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
Revanth Reddy Tweet: తెలంగాణలో రైతు పండగ ముగింపు కార్యక్రమాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదేరోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి మార్పు కోసం ఓటేశాడని.. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని తెలిపారు సీఎం రేవంత్.
ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ, 7 వేల 6 వందల కోట్ల రూపాయల రైతు భరోసా, వరికి బోనస్, 10వేల 444 కోట్ల రూపాయల విలువైన ఉచిత విద్యుత్, 95 కోట్ల నష్ట పరిహారం...ఇలా ఒక్క ఏడాదిలో రైతుల కోసం తమ ప్రభుత్వం 54 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
ఇది నెంబర్ కాదని.. రైతులు తమపై పెట్టుకున్న నమ్మకం అని తెలిపారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లో జరిగే రైతు పండగ ముగింపు ఉత్సవాల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నానంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.