Hyderabad: మన్నెగూడ మహిళా కానిస్టేబుల్ హత్య కేసులో ట్విస్ట్
Constable Nagamani: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మన్నెగూడలో మహిళా కానిస్టేబుల్ హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది.
Constable Nagamani: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మన్నెగూడలో మహిళా కానిస్టేబుల్ హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆస్తి కోసమే నాగమణిని తమ్ముడు పరమేష్ హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానై నడిపించాడు సోదరుడు పరమేష్. అయితే నాగమణికి ఇదివరకే వివాహం జరిగింది. ఆపై విడాకులు కూడా తీసుకుంది. మొదటి వివాహం సమయంలో తమ వారసత్వ భూమిని తమ్ముడికి ఇచ్చింది నాగమణి. విడాకుల తర్వాత తాను శ్రీకాంత్‌ను కులాంతర వివాహం చేసుకుంది.
తమ్ముడికి ఇచ్చిన భూమి నుంచి వాటా ఇవ్వాలని తమ్ముడు పరమేష్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సమాచారం. దీంతో స్కూటీపై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో డ్యూటీకి వెళ్తుండగా నాగమణిని కారుతో ఢీకొట్టాడు పరమేష్. నాగమణి కింద పడిపోగానే కత్తితో హత్య చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు పరమేష్ ఉన్నాడు.
Also Read: రంగారెడ్డి జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి చంపిన తమ్ముడు