Pushpa 2 Ticket Price Hike: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Pushpa 2 Ticket Prices: పుష్ప-2 సినిమా టికెట్ చార్జీలపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

Update: 2024-12-03 09:11 GMT

పుష్ప2 టికెట్ ధరల పెంపు: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Pushpa 2 Ticket Prices: పుష్ప-2 సినిమా టికెట్ చార్జీలపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బెనిఫిట్ షో ల పేరుతో పాటు మొదటి 15 రోజులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ప్రభుత్వమే టికెట్ ధరలు పెంచడానికి అనుమతించింది కదా అని పిటిషనర్ ను జడ్జి ప్రశ్నించారు.ధరల పెంపుతో వినియోగదారులపై భారం పడుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పెంచిన రేట్లు ఛారిటీలకు, సీఎం, పీఎం సహాయ నిధి ఖాతాలోకి వెళ్లట్లేదని పిటిషనర్ వాదించారు. టికెట్ ధరల పెంపుతో నిర్మాత లబ్ది పొందుతున్నాడని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు.

బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్ కు రూ. 800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. అభిమాన సంఘాల కోసమే బెనిఫిట్ షో ఏర్పాటు చేశామని.. అందుకే బెనిఫిట్ షో లకు రేట్లు పెంచామని వాదనలు వినిపించిన నిర్మాత తరపు న్యాయవాది. బెనిఫిట్ షో ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎక్కడికి మళ్లిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన జీవోలను కూడా పరిశీలిస్తామని జడ్జి తెలిపారు. పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని నిర్మాతను ఆదేశించారు.

రాత్రి 10 గంటలకు షో వేస్తే అర్ధరాత్రి ఒంటిగంటకు సినిమా పూర్తౌతోంది.పిల్లలకు నిద్ర అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది.

సినిమా విడుదలైన తొలి 15 రోజులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని పిటిషనర్ చెప్పారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.థియేటర్లలో టికెట్ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని జడ్జి చెప్పారు. థియేటర్లలో టికెట్ ధరల కంటే తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని జడ్జి . బెనిఫిట్ షో కు ఒక వ్యక్తి 10 మంది కుటుంబ సభ్యులతో వెళ్తే రూ. 8 వేలు ఖర్చు అవుతోందని జడ్జి అన్నారు. కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ 17 కి విచారణ వాయిదా వేసింది హైకోర్టు.

Tags:    

Similar News