Nizamabad National Highway 44: కామారెడ్డి హైవే పై చిరుత..భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు

Nizamabad National Highway 44: తెలంగాణలో పులుల సంఖ్య భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది.

Update: 2024-12-04 00:08 GMT

Nizamabad National Highway 44: తెలంగాణలో పులుల సంఖ్య భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే నిత్యం ఏదొక ప్రాంతంలో జనాలను భయపెట్టిస్తూనే ఉన్నాయి. అడవులను విడిచి జనవాసాల్లో సంచరిస్తున్నాయి. మొన్నటివరకు టైగర్ జానీ భయపెట్టింది. ఈమధ్య కుమురంభీ ఆసీఫాబాద్ జిల్లాలో పులి సంచారం..ఇద్దరిపై పంజా విసిరింది. దీంతో పులి అంటే గజగజా వణికిపోతున్నారు జనాలు. ఇప్పుడు మరో చిరుత..కామారెడ్డి హైవేపై జనాలను భయబ్రాంతులకు గురి చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

నిజామాబాద్ జిల్లా చంద్రయాన్ పల్లి దగ్గి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి నేషనల్ హైవే 44పైన ఓ చిరుతగా నడుచుకుంటూ వచ్చింది. అయితే సాధారణాలు హైవేపై స్పీడ్ తో దూసుకెళ్తుంటాయి. రాత్రి సమయంలో ఇంకా వేగంగా ఉంటాయి. రోడ్డుపైకి వచ్చి రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. అదే సమయంలో వేగంగా వస్తున్న ఓ కారు చిరుతను గమనించక దాన్ని దాటుకుని వెల్లిపోయింది. సెడెన్ గా కంట్రోల్ చేయలేక చిరుతను డీకొట్టింది.

అది చిరుత అని తెలియడంతో ప్రాణ భయంతో కారు వేగాన్ని మరింత పెంచారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిరుత రోడ్డుపై కూలబడ్డది.కాళ్లకు గాయాలయ్యాయి. లేచి నడవలేపోయింది. రోడ్డుపై పడుకుని నొప్పటితో తల్లడిల్లింది. అది గమనించిన కొంతమంది వాహనదారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కొంతమంది వీడియోలు తీయడం అవి కాస్త వైరల్ గా మారాయి. 



Tags:    

Similar News