Vehicles Smuggling: నేషనల్ హైవేపై వాహనాల అక్రమ రవాణా.. విదేశాలకు ఎగుమతి

Vehicles Smuggling: వికారాబాద్ జిల్లా పరిగిలో బోర్‌వెల్ వాహనాల అక్రమ రవాణాను పరిగి పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2024-10-10 07:44 GMT

Vehicles Smuggling: నేషనల్ హైవేపై వాహనాల అక్రమ రవాణా.. విదేశాలకు ఎగుమతి

Vehicles Smuggling: వికారాబాద్ జిల్లా పరిగిలో బోర్‌వెల్ వాహనాల అక్రమ రవాణాను పరిగి పోలీసులు అడ్డుకున్నారు. వారం వ్యవధిలోనే మరో బోర్‌వెల్ వాహనం అక్రమ వాహనం పక్క దేశాలకు ఎగుమతి చేసేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారం కింద ఓ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దాని ఛాసిస్ నంబర్ ఆన్‌లైన్‌ లో సర్చ్ చేయగా... నో డేటా అని రావడంతో.. అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిన్న రాత్రి కూడా ఓ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా రోడ్ ట్యాక్స్ లేకుండా బోర్ డ్రిల్లింగ్ వాహనాలను అక్రమార్కులు ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది.

తెలంగాణ నుంచి పరిగి మీదుగా రాష‌్ట్రం దాటించి.. అక్కడినుంచి కర్ణాటక, షోలాపూర్ మీదుగా ముంబై.. అక్కడినుంచి షిప్‌ల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రభుత్వ ఆదానికి భారీగా గండి కొడుతూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుండటంతో నెలలో దాదాపు 45 వాహనాలను ఎగుమతి చేస్తూ 10 కోట్ల స్కాం జరుగుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పట్టుకున్న వాహనాలను వదిలిలపెట్టడానికి బడా నేతలతో పోలీసులకు ఫోన్ కాల్ చేయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.

Full View


Tags:    

Similar News