Nizamabad - Ganesh 2021: నిజామాబాద్‌లో ఆకట్టుకుంటున్న వెరైటీ గణేషులు

Nizamabad - Ganesh 2021: *విభిన్న రూపాల్లో విఘ్నేశ్వరులు *మొక్కితే తీర్దం ఇచ్చే గణపతి

Update: 2021-09-17 04:48 GMT

నిజామాబాద్‌లో ఆకట్టుకుంటున్న వెరైటీ గణేషులు

Nizamabad - Ganesh 2021: బొజ్జ గణపయ్యలు.. విభిన్న రూపాల్లో భారీ గణపతులు ఒకవైపు.. సినిమాలను తలపించే సెట్టింగులు మరోవైపు.. భక్తులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. నిజామాబాద్‌లో ఈ సారి తీర్దం ఇచ్చే గణపతి, మంచు గణపతులు ఔరా అనిపిస్తున్నాయి. గణేష్ మండపాల నిర్వహకులు సరికొత్త ఆలోచనలతో చేసిన వివిధ అలంకరణలు ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. విభిన్న రూపాల్లో వినాయకును ప్రతిష్టించడంతో భక్తులు ఆ వినాయకులను చూసేందుకు క్యూ కడుతున్నారు.

నగరంలోని వర్ని చౌరస్తాలో రుద్రాక్షలతో గణనాథున్ని ఏర్పాటు చేశారు. భక్త హిందూ గణేష్ మండలి నిర్వహాకులు.. ఏటా ఏదో ప్రత్యేకతతో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఈ సారి రుద్రాక్షలతో చేసిన గణపతి ఆకట్టుకుంటోంది. నాందేవ్ వాడ రావూజీ వంజరి సంఘం ఏర్పాటు చేసిన గణపతి.. భక్తితో మొక్కితో చాలు తొండంతో తీర్దం ఇస్తోంది. ఈ తీర్ద గణపతిని చూసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో.. సుమారు 100కు పైగా భారీ గణపతులను మండళ్ల నిర్వహాకులు ప్రతిష్టించారు. హమాల్ వాడిలో ఏర్పాటు చేసిన 17 ఫీట్ల అతి భారీ బొజ్జ గణపయ్యను చూస్తున్న భక్తులు ఆ గణనాథుడే స్వయంగా వచ్చాడా అన్నట్లు తిలకిస్తున్నారు. ఈ గణపతి చెవులను ఆడించడం, కళ్లు తెరవడం ప్రత్యేకతగా నిలుస్తోంది. నగరంలోని రాజస్దాన్ భవన్‌లో మార్వాడీ సమాజ్ యువకులు రోజుకు ఒక రూపంలో వినాయకుని డెకరేట్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కళాకారులు 8 రూపాల్లో మంచు గణపతులను తీర్చిదిద్దారు. అష్ట రూపాల గణనాథులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News