బీజేపీ ప్రచారానికి తరలి వస్తున్న స్టార్ క్యాంపెయినర్లు

Update: 2020-11-20 12:32 GMT

గ్రేటర్ లో నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. ఇక ప్రచారం షురు కానుంది. ఎన్నికల కమిషన్ స్టార్ కాంపెయినర్లను నియమించుకోడానికి అనుమతినివ్వడంతో పార్టీలన్నీ అగ్ర నేతలతో ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. గ్రేటర్ లో పట్టుకోసం తపన పడుతున్న బీజేపీ ఇప్పటికే బండి సంజయ్ తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు లక్ష్మణ్, డీ.కె. అరుణ ప్రచార బరిలో దించగా పార్టీ అగ్రనేతలతో పాటూ,మరికొందరు కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి రానున్నారు. ప్రచారం ముగింపు రోజు కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, ప్రకాష్ జవడేకర్లతో పాటు బీజేపీ యువజన విభాగం బాధ్యతలు చూసుకునే తేజస్వి సూర్య కూడా రానున్నారు. వీరంతా ముగింపు రోజు సాయంత్రం రోడ్ షోలలో పాల్గొంటారు.

Tags:    

Similar News