Nirmala Sitharaman: తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు..
Nirmala Sitharaman: కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ టీఆర్‌ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Nirmala Sitharaman: కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ టీఆర్‌ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పథకాల పేర్లను తెలంగాణ ప్రభుత్వం మార్చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం ఒక పేరు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకో పేరు పెట్టి అమలు చేస్తోందన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తుంటే ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయాన్ని లక్షా 20వేల కోట్లకు పెంచారని అన్నారు సీతారామన్.
తెలంగాణ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి పోతోందని విమర్శించారు. తెలంగాణలో పుట్టబోయే పిల్లలపైనే తలకు లక్షా పాతికవేలు అప్పు ఉంటోందని తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని.. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ తీరుతో రైతులు అప్పులపాలయ్యారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.