Jaishankar: అసలు ఇండియా-అమెరికా చర్చల మధ్య ఆ టాపిక్కే రాలేదన్న జైశంకర్
Jaishankar: ఇండియాలో హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికా మంత్రి
Jaishankar: ప్రజలు ఏదైనా తెలుసుకోవచ్చు. ఏమైనా చూడొచ్చు ఇండియాలో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ వ్యాఖ్యానించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోం శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇండియా-అమెరికా చర్చల మధ్య ఆ టాపిక్కే రాలేదన్నారు. ఎప్పుడో మాట్లాడుకున్న విషయాలను ఇప్పుడు హైలెట్ కొందరు ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదన్నారు. ఈ వారం అమెరికాలో జరిగిన రెండు దేశాల 2+2 మంత్రుల సమావేశంలో మానవ హక్కుల అంశం అసలు ప్రస్తావనకు రాలేదని ఒకవేళ చర్చకు వస్తే అందుకు సమాధానం ఎలా చెప్పాలో ఇండియాకు తెలుసున్నారు జైశంకర్.
అమెరికాతో తాజా చర్చల్లో రాజకీయ-సైనిక వ్యవహారాలపై దృష్టి పెట్టామన్నారు జైశంకర్. గతంలో ఇండియాకు అమెరికా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి వచ్చిన తరహాలోనే చర్చల కోసం ఇప్పుడు తాను, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా వెళ్లామన్నారు. రెండు దేశాల చర్చల తర్వాత భారతదేశంలో ప్రభుత్వంలోని కొందరు, పోలీసులు, జైలు సిబ్బంది హక్కులు ఉల్లంఘిస్తున్నారంటూ కామెంట్ చేశారు. మొత్తం వ్యవహారాలను అమెరికా నిశతంగా పరిశీలిస్తుందంటూ ఆయన చెప్పారు.
అయితే ఇరు దేశాల మధ్య తాజాగా జరిపిన చర్చల్లో అసలు మానవ హక్కుల అంశం చర్చకు రానేరాలేదని ఎవరైనా అలా భావిస్తే తాను చేయగలిగిందేమీ లేదన్నారు జైశంకర్. సెక్రటరీ బ్లింకెన్ ఇండియా వచ్చినప్పుడు ఈ అంశం ఇరుదేశాల మధ్య చర్చకు వచ్చిందన్నారు. గతంలో ఇదే అంశంపై ఇండియా అభిప్రాయాన్ని అమెరికాతో చర్చించామన అదే అంశాన్ని మీడియాకు వివరించామన్నారు జైశంకర్. అమెరికాతో సహా ఇతర దేశాల్లో మానవ హక్కుల పరిస్థితిపై కూడా ఇండియా అభిప్రాయాలు చెబుతోందని స్పష్టం చేశారు. ఎక్కడైనా మానవ హక్కుల సమస్యలు తలెత్తినప్పుడు, ముఖ్యంగా అవి భారతీయులకు సంబంధించినవైతే వాటిని పరిగణలోకి తీసుకొని చర్చిస్తామన్నారు జైశంకర్. అలాంటి వ్యవహారాన్ని నిన్న కూడా పరిశీలించామన్నారు జైశంకర్.