CP DS Chauhan: మహిళపై థర్డ్ డిగ్రీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు
Rachakonda CP: మీర్‌పేట్ పీఎస్ పరిధిలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై రాచకొండ సీపీ చర్యలు తీసుకున్నారు.
Rachakonda CP: మీర్‌పేట్ పీఎస్ పరిధిలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై రాచకొండ సీపీ చర్యలు తీసుకున్నారు. మహిళపై దాడికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ శివకుమార్, మహిళా కానిస్టేబుల్ సుమలతపై సస్పెన్షన్ వేటు వేశారు. నందిహిల్స్ కాలనీలో నివాసముంటున్న వరలక్ష్మిపై ఎల్బీనగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలతో సీపీ చర్యలు తీసుకున్నారు. బాధితురాలిపై దాడిని నిరసిస్తూ బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ఆరోపణలపై స్పందించిన రాచకొండ సీపీ చౌహాన్ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.