TSPSC ప్రశ్నా పత్రాల లీకేజీకేసులో మరో ఇద్దరు అరెస్ట్.. కూతురు సాహితీ భవిష్యత్తుకోసం..
TSPSC: టెక్నికల్ ఎవిడెన్స్, పక్కా సాక్ష్యాధారాలను సేకరించేపనిలో సిట్
TSPSC: TSPSC ప్రశ్నా పత్రాల లీకేజీకేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఏఈఈ పరీక్షలో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు డీల్ కుదుర్చుకుని పరీక్షరాసిన అభ్యర్థి సాహితీ అనే యువతిని, ఆర్థిక లావాదేవీలతో ప్రమేయం ఉన్న ఆమెతండ్రి మద్దెల శ్రీనివాస్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కూతురు సాహితీ భవిష్యత్తుకోసం... తండ్రి శ్రీనివాస్ డిఈ పూల రమేష్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు అధికారుల ధర్యాప్తులో వెల్లడైంది. తాజాగా ఈ ఇద్దరి అరెస్టుతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాల లీకేజీకేసులో అరెస్టు అయిన వారిసంఖ్య 80కి చేరుకుంది. సిట్ అధికారుల ధర్యాప్తులో మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసేందుకు టెక్నికల్ ఎవిడెన్స్, పక్కా సాక్ష్యాధారాలను సేకరించేపనిలో సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. డిఈ రమేశ్ వ్యవహారాలు, కాల్ డేటా ఆధారంగా, ఆర్థిక లావాదేవీలను విశ్లేషించి మరికొంతమంది నిందితులను అదుపులో తీసుకోనున్నారు.