TSRTC: ప్రయాణికులకు షాక్.. మరోసారి ఛార్జీలు పెంచిన ఆర్టీసీ..

TS RTC Charges: టీఎస్‌ ఆర్టీసీ మరోసారి బస్సు ఛార్జీలు పెంచింది.

Update: 2022-04-08 14:09 GMT

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ షాక్.. మరోసారి ఛార్జీలు పెంచిన ఆర్టీసీ..

TS RTC Charges: తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ‌ సర్వీసుల్లో డీజిల్ సెస్ కింద 2 రూపాయలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసుల్లో 5 రూపాయలు పెంచారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. 2021 డిసెంబర్‌లో పెరిగిపోతున్న డీజిల్ ధరలతో టీ.ఎస్.ఆర్.టీ.సీ ఆర్థిక భారాన్ని మోస్తోంది. 2021 డిసెంబర్‌లో 85 రూపాయలు ఉన్న హెచ్.ఎస్.డీ ఆయిల్ ధర ప్రస్తుతం 118 రూపాయలకు చేరింది. పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి గుది బండగా మారాయి. తప్పనిసరి పరిస్థితుల్లో డీజిల్ సెస్ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది.

Tags:    

Similar News