TSPSC: TSPSC పేపర్ కేసులో సంచలనాలు.. ఊహించని రీతిలో బయటపడుతున్న నిందితులు
TSPSC: 50కి చేరిన అరెస్ట్‌ల సంఖ్య
TSPSC:TSPSC పేపర్ లీకేజీ కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఊహించని రీతిలో నిందితులు బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 50కి చేరింది. TSPSC లావాదేవీల లెక్క
లక్షలు దాటి కోటికి చేరుకుంది. ఇదిలా ఉండగా తాజాగా హైటెక్ కాపీయింగ్ వ్యవహారం బట్టబయలు అయ్యింది. విద్యుత్‌శాఖ డీఈ సురేష్ ఆధ్వర్యంలో భారీ హైటెక్ ముఠా ఏర్పాటు చేసుకొని.. వరంగల్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు అభ్యర్థులు.
ఈ సంచలనాలన్నీ ఒక్కొక్కటిగా సిట్ దర్యాప్తులో బయటపడుతున్నాయి. డీఏవో పేపర్‌ను 15 మంది అభ్యర్థులకు అమ్ముకున్నాడు విద్యుత్‌శాఖ డీఈ. తన వద్ద ఏఈఈ పేపర్ లేకపోయినప్పటికీ.. హైటెక్ కాపీయింగ్ చేయిస్తానని 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిర్ధారించుకున్నారు. పరీక్ష హాల్‌లో ఇన్విజిలెటర్‌తో డీల్ కుదుర్చుకొని.. పరీక్ష హాల్‌కు వెళ్లే ముందే మైక్రోఫోన్‌లు, ఇయర్ బడ్స్ ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం ఇన్విజిలెటర్‌ను సిట్ అదుపులోకి తీసుకుంది. అయితే ఇంకా అరెస్ట్‌ల పర్వం కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.