తెలంగాణలో విద్యుత్ కొలువులు
నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విద్యత్ కొలువుల నోటిఫికేషన్ ను ఎట్టకేలకు విడుదల చేసారు.
నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విద్యత్ కొలువుల నోటిఫికేషన్ ను ఎట్టకేలకు విడుదల చేసారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) 2,500 జూనియర్ లైన్‌మెన్, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కలిపి మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. సంస్థ వెబ్‌సైట్లు https://www.tssouthernpower.com లేదా https:// tssouthernpower.cgg.gov.inలో ఈ నోటిఫికేషన్లను పొందుపరిచింది. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల భర్తీని ప్రభుత్వం చేపట్టింది.
అర్హత వివరాలు..
♦ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు బీఏ/బీకాం/బీఎస్సీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు 18–34 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.
♦ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, శారీరక వికలాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి మినహాయింపు.
♦ జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు 18–35 ఏళ్ల వయసుతో పాటు పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
♦ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి మినహాయింపు.
ముఖ్యమైన తేదీలు
♦ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
30.10.2019 : ఫీజుల చెల్లింపు ప్రారంభం
31.10.2019 : దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
20.11.2019 (సాయంత్రం 5 వరకు) : ఫీజుల చెల్లింపునకు గడువు పూర్తి
20.11.2019 (రాత్రి 11.59 వరకు) : ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు పూర్తి
11.12.2019 : హాల్ టికెట్ల డౌన్‌లోడింగ్ ప్రారంభం
పరీక్ష తేదీ : 22.12.2019
♦ జూనియర్ లైన్‌మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్
21.10.2019 : ఫీజుల చెల్లింపులు ప్రారంభం
22.10.2019 : దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
10.11.2019 : ఫీజుల చెల్లింపునకు గడువు పూర్తి
10.11.2019 (రాత్రి 11.59 వరకు) : ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు గడువు పూర్తి
05.12.2019 : హాల్ టికెట్ల డౌన్‌లోడింగ్ ప్రారంభం
పరీక్ష తేదీ : 15.12.2019