TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
TS High Court: ఈ నెల 1 నుంచి 25 వరకు 23.55 లక్షల కరోనా టెస్టులు -ప్రభుత్వం
TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఈ నెల 1 నుంచి 25 వరకు 23 లక్షల 55 వేల కరోనా టెస్టులు చేశామని కోర్టుకు తెలిపింది. RTPCR టెస్టులు 4లక్షల 39వేలు చేయగా రాపిడ్ టెస్టుల సంఖ్య 19 లక్షల 16వేలని కోర్టుకు తెలియజేసింది. కరోనా పరీక్షలు సంఖ్య పెంచేందుకు చర్యలు చేపడుతున్నామంది. ఈ నెల 1 నుంచి 25 వరకు కరోనా బారిన పడి 341 మంది మృతిచెందినట్టు నివేదికలో పేర్కొంది.
వైన్ షాపులు, బార్లు, పబ్‌లలో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టామన్న ప్రభుత్వం రెమిడిసివిర్ సరఫరా పర్యవేక్షణకు నోడల్ అధికారిగా ప్రీతిమీనాను నియమించినట్టు స్పష్టం చేసింది. అలాగే.. రాష్ట్రానికి 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని, వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను చేరవేస్తున్నామంది టీఎస్ సర్కార్.