Drugs Case: బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు.. రేవంత్, బండి సంజయ్ రాజీనామాకు డిమాండ్
Drugs Case: డ్రగ్స్ వ్యవహరంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.
Drugs Case: డ్రగ్స్ వ్యవహరంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. బీజేపీ, కాంగ్రెస్ నేతల సన్నిహితులే డ్రగ్స్ అమ్ముతున్నారని ఆరోపించారు. భవిష్యత్ లో మరిన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కేసీఆర్ రివ్యూ చేశారని తెలిపారు.
హైదరాబాద్ లో గతంలో ఉన్న పేకాట క్లబలన్నీ కాంగ్రెస్ నేతలవే అన్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసుల్లో దొరికే పిల్లలు కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెందినవారేనన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరికి నీతులు చెప్తారని ప్రశ్నించారు. డ్రగ్స్ విషయంలో బండి సంజయ్ బాధ్యత వహించి బీజేపీ అధ్యక్ష పదవికి, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.