ఢిల్లీ చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు

TRS Leaders: ధర్నాచేపట్టనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ప్రజాప్రతినిధులు

Update: 2022-04-10 09:14 GMT
TRS Leaders in Delhi | Telugu News

ఢిల్లీ చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు

  • whatsapp icon

TRS Leaders: దేశవ్యాప్తంగా ఒకే విధానంతో వరిధాన్యం కొనుగోళ్లు చేయాలనే డిమాండుతో టీఆర్ఎస్ ఢిల్లీలో మెగా ధర్నా నిర్వహించేందుకు సంసిద్ధమైంది. ఢిల్లీలో చేపట్టబోయే ధర్నా కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం వహించబోతున్నారు. ముందస్తుగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యులు సురేశ్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాగు విస్తీర్ణంతో వ్యవసాయం అభివృద్ధి చెందితే. కేంద్ర ప్రభుత్వం ధాన్యంకొనుగోలు విషయంలో ఇబ్బంది పెడుతోందని టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఢిల్లీలో టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ సహా లోక్ సభసభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు తమ నిరసన గళాన్ని విన్పించబోతున్నారు.

Tags:    

Similar News