Lalu Naik Murdered In Nalgonda: ఆస్తి తగాదాలతో టీఆర్‌ఎస్‌ నేత హత్య

Lalu Naik Murdered In Nalgonda: చిన్నగా మొదలైన కుటుంబ ఆస్తి తగాదాలు ఇంతకింత పెరిగి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన చందంపేట మండలంలో చోటు చేసుకుంది.

Update: 2020-07-05 09:09 GMT

Lalu Naik Murdered In Nalgonda: చిన్నగా మొదలైన కుటుంబ ఆస్తి తగాదాలు ఇంతకింత పెరిగి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన చందంపేట మండలంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే గత కొంత కాలంగా చందంపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లాలునాయక్‌ (50) కుటుంబానికి, పాత పోలేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌ గోప్యానాయక్‌ కుటుంబానికి కొంత కాలంగా ఆస్తి తగాదాలు నడుస్తోంది. ఈ తగాదాలను పరిష్కరించుకోవడానికి ఇరుకుటుంబాల పెద్దలు పోలీస్టేషన్లకు వెల్లారు. అయినా ఫలితం లేదు.

ఇదిలా ఉంటే రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లాలునాయక్‌ కుమార్తె రమావత్‌ పవిత్ర ప్రస్తుతం చందంపేట జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతుంది. కాగా జిల్లా అధికారుల ఆదేశాను సారం చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద బస్‌షెల్టర్‌ను ఆక్రమించుకొని రోడ్డు వెంట ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఆర్‌అండ్‌బీ పోలీస్‌శాఖ సంయుక్తంగా తొలగించడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో గోప్యానాయక్‌ కుమారుడు విజయ్‌నాయక్, లాలునాయక్‌లు ఇద్దరు ఎదురెదురుగా తారసపడ్డారు. ఆ తరువాత ఇరువురు ఆస్తి విషయంలో తగాదా పడ్డారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిద్దరిపై లాఠీచార్జ్‌ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి వెళ్లిన ఇద్దరు బిల్డింగ్‌తండా గ్రామానికి చేరుకుని మళ్లీ ఘర్షణ పడ్డారు.

ఈ ఘర్షనలో లాలునాయక్‌ పై దాడి చేయడంతో ఆయన తీవ్రగాయాలపాలయ్యారు. అది గమనించిన స్థానికులు అతన్ని వెంటనే దేవరకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయన్ని పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌ తరలించాలన్నారు. దీంతో ఆయన కుంటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. లాలు నాయక్‌ మృతిచెందిన విషయం తెలుసుకున్న అతని వర్గీయులు విజయ్‌నాయక్‌ ఇంటిపై దాడికి దిగి సామగ్రిని ధ్వంసం చేశారు. పోలేపల్లి, బిల్డింగ్‌తండాలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో పికెట్‌ ఏర్పాటుచేసినట్లు ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ తెలి పారు. శాంతిద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags:    

Similar News