టీఆర్‌ఎస్‌-ఎంఐఎంది అవినీతి కూటమి : స్మృతి ఇరానీ

Update: 2020-11-25 09:15 GMT

రోహింగ్యాలను టీఆర్ఎస్‌, ఎంఐఎం కలిసి రాజకీయ లాభం కోసం వాడుకుంటున్నాయన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండు పార్టీలు అక్రమ వలసదారులకు మద్దతిస్తున్నాయని టీఆర్‌ఎస్‌- ఎంఐఎంది అవినీతి కూటమి అని ఆరోపించారు. వారిని ఓటర్ లిస్టులో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్మృతి ఇరానీ. రోహింగ్యాల విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు. తెలంగాణలో కుటుంబ పాలనపై బీజేపీ చార్జిషీట్ విడుదల చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. ఎంఐఎం నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ ఎందుకు విచారణకు అదేశించదు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదు.. ప్రభుత్వ పథకాలు అన్ని ఎందుకు పాతబస్తీకి చేరడం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పరిధిలో ఉంటది. ఎంఐఎం ఎమ్మెల్యే లేఖలు ఉన్నా ప్రభుత్వం విచారణ చేయడం లేదు. టీఆర్‌ఎస్‌- ఎంఐఎం తెలంగాణ రాష్ట్రంలో మిత్ర పార్టీలు. రెండు పార్టీలు కలిసి రాజకీయ డ్రామా అడుతున్నాయి అంటూ స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News