Hyderabad: రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి టీఆర్ఎస్ కార్యకర్తల యత్నం
* టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు * మంత్రి కేటీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన
Hyderabad: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.