Indrasena Reddy: మహబూబాబాద్ జిల్లా లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి పర్యటన
Indrasena Reddy: తాళ్లపూసపల్లి గ్రామంలో పిచికారీ డ్రోన్ లను ప్రారంభించిన ఇంద్రసేనారెడ్డి
Indrasena Reddy: కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, రైతులు సాంప్రదాయ వ్యవసా యాభివృద్ధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి రైతులను కోరారు. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి గ్రామానికి విచ్చేసిన గవర్నర్ పంటలకు పిచికారి చేసే డ్రోన్ లను ప్రారంభించారు. రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తే ఆశించిన ఆర్థిక లాభాలు చేకూరుతాయన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సహజ సిద్ధమైన పద్ధతిలో పంటలు సాగు చేసినట్లయితే నాణ్యమైన పంట వస్తుందన్నారు.