మూడు పార్టీల్లోనూ మునుగోడు టెన్షన్
Munugodu: ఉప ఎన్నికలో విజయంపై ఎవరికి వారే ధీమా
Munugodu: మూడు పార్టీల్లోనూ మునుగోడు టెన్షన్ నెలకొంది. ఉప ఎన్నికలో విజయంపై ఎవరికి వారే... పైకి ధీమాగా కనిపిస్తున్నా..... లోపల భయం వెంటాడుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో అర్థరాత్రి వరకు సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 20న మునుగోడులో భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ కుట్రని మండిపడ్డారు. అటు బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. నేడు తరుణ్‌చుగ్ తెలంగాణకు రానున్నారు. 11 గంటలకు చేరికల కమిటీతో భేటీ అవుతారు. అటు కాంగ్రెస్ పార్టీ చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఈ నెల 13 నుంచి 20 వరకు వరుస కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి 17 వరకు మండలస్థాయి నేతలతో భేటీలు జరపాలని టీపీసీసీ డిసైడ్ చేసింది.