టీఎస్ఆర్జేసీ-సెట్ పరీక్షలు రాసి ఎప్పుడెప్పుడా అని విద్యార్దులు ఎదురుచూస్తున్న ఫలితాలు రానేవచ్చేసాయి. ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రథమ సంవత్సర ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను నేడు ప్రకటించారు. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌ఆర్‌జేసీ-సెట్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బైపీసీలో 1,440, ఎంపీసీలో 1,500, ఎంఇసీలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని సొసైటీ కార్యదర్శి ఎస్ వెంకటేశ్వర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈ సీట్లను భర్తీ చేసేందుకు గాను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్(టీఆర్ఈఐ) సొసైటీ పరిధిలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లోని 3 వేల సీట్లకు ఈ పరీక్షను నిర్వహించారు. ఎంపీసీ విభాగంలో ఈ నెల 19న అదేవిధంగా బైపీసీ, ఎంఇసీ విభాగాలకు ఈ నెల 20న కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.