వరంగల్‌లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం

Warangal: ఐదు కేంద్రాల్లో ఆటోమెటిక్ కెమెరాలు ఏర్పాటు

Update: 2022-09-01 03:06 GMT

వరంగల్‌లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం

Warangal: వరంగల్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అత్యాధునిక పరిజ్ఞానంతో 360 డిగ్రీలో ఫోటోలు తీసే టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేసి ట్రాఫిక్ నియంత్రణకు వినియోగించుకుంటున్నారు. దీంతో ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ ధరించాలన్న నిబంధనలు ఇప్పటికే అమలు చేస్తున్న వరంగల్ ట్రాఫిక్ పోలీసులు...ఇతర ట్రాఫిక్ నిబంధనలపై ఫోకస్ పెట్టారు. వాహన చోదకులు రోడ్డు భద్రత నియమాలు పాటించకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ఈ-చాలన్ల ద్వారా జరిమానాలు విధించేలా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ఐదు కేంద్రాల్లో 24 గంటలు వీక్షించే విధంగా ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న ఈ నూతన టెక్నాలజీని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశారు. ఈ కెమెరాలు 360 డిగ్రీల్లో వాహనదారుల ఫోటోలు క్యాప్చర్ చేసి ఎప్పటికప్పుడు I.C.C.C.కి అందజేస్తున్నాయి.

హన్మకొండ నగరంలో కొత్త టెక్నాలజీతో ట్రాఫిక్ రూల్స్ నియంత్రణ సాగుతోంది. హన్మకొండ నగరంలో ప్రధాన కూడళ్ళలో అధునాతన టెక్నాలజీతో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హెల్మెంట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్ , సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ , జిబ్రా లైన్ క్రాస్ కెమెరాల్లో రికార్డవుతోంది. దీని ఆధారంగా ఆయా పోలీస్ స్టేషన్లలో ఆటోమేటిగ్గా ఫైన్లు పడతాయి. నేరుగా ఇంటికే ఈ- చలానా వస్తుంది. నగరంలో ప్రజలందరు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటున్నారు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు.

వరంగల్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సందులు,గొందుల్లో వాహనాలు ఆపి ఫైన్ లు వేస్తున్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కావాలనే వాహనాలను ఆపి 100 లేదా 200 రూపాయలు ఫైన్ లు వేస్తున్నారని వాహనదారులంటున్నారు. ఏదైనా హాస్పిటల్ అత్యవసర పనిమీద వెళ్ళినా మినహాయింపు ఇవ్వడం లేదంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకుని కొంత వెసులుబాటు కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.

హన్మకొండ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడపడితే అక్కడే వాహనాలు ఆపి ఫైన్స్ వేస్తున్నారు. వాహనాలను రోడ్డు మీద సడన్ గా ఆపడంతో ప్రమాదాలు జరిగి చాలా మంది గాయపడ్డారు. వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి కార్డు, ఇతర అన్ని కాగితాలు ఉన్నా ఏదోక కారణంతో ఫైన్స్ వేసి జేబులు గుల్ల చేస్తున్నారని వాహ‍నదారులు వాపోతున్నారు. హాస్పిటల్ పని మీద అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ట్రాఫిక్ పోలీసులతో చాలా ఇబ్బందులు ఉన్నాయని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News