Coronavirus: ఖైరతాబాద్‌ జంక్షన్‌లో పేయింటింగ్‌తో పోలీసులు మేసేజ్‌

Coronavirus: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది.

Update: 2021-05-31 11:56 GMT

ఖైరతాబాద్‌ జంక్షన్‌లో పేయింటింగ్‌తో పోలీసులు మేసేజ్‌

Coronavirus: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అటు ఎంత చెప్పినా కొందరు వినకపోవడంతో మహమ్మారి వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కరోనా నియంత్రణ కోసం నిబంధనలు పాటిస్తూ ఇళ్లల్లోనే ఉండాలని ఖైరతాబా‌‌ద్‌ జంక్షన్‌లో పేయింటింగ్‌ వేయించి నగరవాసులకు మెసెజ్‌ ఇచ్చారు పోలీసులు. ఎవరి ఇంట్లో వారు ఉండకపోతే, ఇంట్లోకి వస్తానని కరోనా వైరస్‌ అంటుందని ఈపెయింటింగ్‌ ముఖ్య ఉద్ద్యేశమన్నారు సీపీ‌. ఇక పెయింటింగ్‌లో పోలీస్‌ క్యాప్‌తోపాటు రైఫిల్‌ ఉండటం, పోలీసులు ప్రజలకు రక్షణ కవచంలా పని చేస్తున్నారని అర్థమన్నారు ఆయన.

మొత్తానికి కోవిడ్‌ కట్టడికి పోలీసులు ఆంక్షలను కఠిన తరం చేస్తూనే, ప్రజలకు వైరస్‌ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఇక జనాలు కూడా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ తమకు సహకరించాలని, కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

Tags:    

Similar News