సర్కారు ఖజానాకి కాసులు కురిపిస్తున్న ట్రాఫిక్ చలాన్లు.. పోటీలు పడి మరీ వసూళ్లు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

Traffic Police: భాగ్యనగరంలో ట్రాఫిక్ రూల్స్ సర్కారు ఖజానాకి కాసులు కురిపిస్తున్నాయి.

Update: 2021-11-12 06:22 GMT

సర్కారు ఖజానాకి కాసులు కురిపిస్తున్న ట్రాఫిక్ చలాన్లు..

Traffic Police: భాగ్యనగరంలో ట్రాఫిక్ రూల్స్ సర్కారు ఖజానాకి కాసులు కురిపిస్తున్నాయి. నిబంధనల అమలు, వాటిపై అవగాహన కల్పించటం దేవుడు ఎరుగు చలాన్లు వేయడంలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు పోటీ పడుతున్నారు. అసలే పెరిగిన పెట్రోల్ ధరలతో బండి బయటకు తీయాలంటేనే భయపడిపోతున్న సామాన్యుడికి మరోవైపు ట్రాఫిక్ చలాన్ల మోత మోగుతోంది. బండి కనిపిస్తే చాలు ఫోటో దింపి ఇంటికి పంపేస్తున్నారు. నో హెల్మెట్, సిగ్నల్ జంప్, డ్రంకన్ డ్రైవ్ లాంటివి ఆరేండ్లలో ఆరున్నర కోట్ల కేసులు 1794 కోట్ల వసూళ్లతో వర్దిల్లుతుంది మన హైదరాబాద్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్. టార్గెట్‌తో డ్యూటీ చేస్తూ సర్కార్ ఖజానాలో కోట్లు నింపుతున్నారు ట్రాఫిక్ పోలీసులు.

ట్రాఫిక్ రూల్స్‌పై జనాలకు అవగాహన కల్పించరు కానీ నిబంధనల ఉల్లంఘన పేరుతో వాహనదారుల నుంచి ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్స్ రూపంలో వస్తున్న ఆదాయం అయితే నానాటికీ పెరుగుతుందనే చెప్పాలి. ఒకప్పుడు లక్షల్లో ఉన్న ఆదాయం కాస్తా ఇప్పుడు కోట్లకు చేరింది.

నో హెల్మెట్... నో పార్కింగ్... ట్రిపుల్ రైడింగ్... ర్యాష్ రైడింగ్.. రాంగ్ రూట్ డ్రైవింగ్.. ఓవర్ స్పీడ్ ఇలా పేరు ఏదైతేంటి.. ? కాసులు దండుకోవడమే వారి పని. కానిస్టేబుళ్లు, హోంగార్డులకు రోజూ వారీ టార్గెట్స్ నిర్దేశిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సిటీ రోడ్లపై ఎక్కడ చూసినా మనకు ట్రాఫిక్ నియంత్రించే పోలీసులు కన్నా ఫోటోలు తీస్తూ కనిపించే పోలీసులే ఎక్కువగా దర్శనమిస్తారు.

ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాల్సిందే. దాన్ని ఎవరూ కాదనరు. కానీ అవగాహన కల్పించటంపై లేని శ్రద్ద జరిమానాల కలెక్ట్ చేయడం పైనే ఎందుకని సగటు వ్యక్తి ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలో హెచ్‌ఎం టీవీ బృందం క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. జరిమానాలు విధించటంలో శాస్త్రీయత లోపించదని చాలా మంది వాహనదారులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News