పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...

Revanth Reddy: వ్యవసాయంతోనే రాజకీయాల్లో రెడ్లకు గుర్తింపు లభిస్తోందన్న రేవంత్...

Update: 2022-05-23 09:23 GMT

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...

Revanth Reddy: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... ఇప్పుడు సరికొత్త కాంట్రవర్సీకి తెరదీశారు... కర్నాటక సేడంలో వేమారెడ్డి మల్లమ్మ 600 ఏళ్ల జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్. రెడ్ల రాజకీయ వైభవం గురించి... అనూహ్య కామెంట్స్ చేశారు. రెడ్లకు, వెలమలకు చరిత్రలో ఎన్నడూ పొసగదన్న సిద్ధాంతాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు రేవంత్... ప్రస్తుతం రాజకీయాలకు గత చరిత్రను జోడించి రేవంత్ ట్విస్ట్ ఇచ్చారు. చరిత్రలో కాకతీయుల సామ్రాజ్యం... రాణిరుద్రమ పౌరుషం తెలుసని... కానీ కాకతీయ సామ్రాజ్యం పతనం గురించి మాత్రం తెలియదన్నారు రేవంత్ రెడ్డి.

చరిత్ర చదవాలంటూ రెడ్డి సోదరులను కోరారు రేవంత్. రాణిరుద్రమ... రెడ్డి సామాంతరాజుల సహకారంతో కాకతీయ సామ్రాజ్యం వైభవంగా నడిచిందన్నారు. గోన గన్నారెడ్డితో సహా ఎందరో రెడ్డి రాజులు కాకతీయ సామ్రాజ్యాన్నికాపాడారని... ఆ తర్వాత... రుద్రమ వారసుడు ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డిలను పక్కనబెట్టి... పద్మనాయకులు... వెలమలకు పట్టంకట్టారన్నారు. ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యం పై దండెత్తినప్పుడు యుద్ధంలో రెడ్డి సామంత రాజులను కాకుండా... పద్మానాయకులకు అప్పగిస్తే ఓటమిపాలయ్యారంటూ చరిత్ర వివరించారు రేవంత్. దాంతో కాకతీయ సామ్రాజ్యం పతనమైందని... రెడ్లకు ఎవరైతే గౌరవమిస్తారో... ఆ పార్టీలు వచ్చే రోజుల్లో మంచి ఫలితాలు రాబడతాయన్నారు రేవంత్...

రెడ్లు వ్యవసాయాన్ని మరచిపోయి రాజకీయంగానూ, సామాజికంగానూ ఎదురుదెబ్బలు తింటున్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రెడ్డి ప్రతి పేరు పక్కన 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉంటేనే దేశం, రాష్ట్రంలో రెడ్లకు ప్రాధాన్యత ఉంటుందని... అప్పుడే రాజకీయాలు చేయగలుగుతారాన్నారు. వ్యవసాయాన్ని వదిలేయడం వల్లే... రాజకీయంగా రెడ్లు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. రెడ్లు వ్యవసాయం వదలేయడం వల్ల పేదలతో అనుబంధం తెగిపోతోందన్నారు. ఆకలి తీర్చేవారిగా ఉన్నంత కాలం రాజకీయం చేయగలిగామన్నారు. అత్యధిక జనాభాకు విశ్వాసం కలిగించే వ్యవసాయాన్ని వదిలేస్తే... రాజకీయాల్లో కీలక పాత్ర పోషించలేమన్నారు రేవంత్.

తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు రాజకీయంగా చక్రం తిప్పాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రెడ్లు ఎవరి వైపు ఉంటే వారిదే అధికారమన్నారు రేవంత్. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి... మొత్తంగా రెడ్లపై... భారీ ఆశలు పెట్టుకున్నారు రేవంత్. తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం రెడ్లు కాంగ్రెస్ పక్షాన ఉండడానికి సరికొత్త వ్యూహాన్ని తెరమీదకు తెస్తున్నారు రేవంత్. రెడ్లను తెలంగాణలో కాంగ్రెస్ వైపు మళ్లించాలని... అప్పుడే సముచిత స్థానం లభిస్తుందన్నారు.

Tags:    

Similar News